పాత రచనలు

Posted by vrdarla On 4:52 AM


నేను 2004లో
దళితతాత్త్వికుడు పేరుతో ఒక కవితాసంపుటి ప్రచురించాను.దాన్ని వివిధ పత్రికలు సమీక్షించాయి.కవితలపట్ల,టైటిల్ పట్లా చాలామంది స్పందించారు. దీన్ని బ్లాగులో కూడా పెట్టాలనే అభిప్రాయంతో కవితలన్నింటినీ పెట్టాను. వాటిని చదివి చాలామంది స్పందిస్తూ తమ అభిప్రాయాలను రాస్తున్నందుకు ధన్యవాదాలు. మీ అభిప్రాయలను అనుసరించి పునర్ముద్రణలో అవసరమైనంతమేరకు మార్పులు చేర్పులు చేసే ప్రయత్నం చేస్తాను.అవసరమైతే కవితాసంపుటి పేరుకూడ మార్చటానికి కూడా వెనుకాడను...కానీ... దానికి సరైన విశ్లేషణను ఆశిస్తున్నాను.ఇప్పటికే కొంతమంది టైటిల్ విషయంలో స్పందించారు.వాటి గురించి ఆలోచిస్తున్నాను. అంతేకాదు. వీటినిని మళ్ళీ ప్రచురించేటప్పుడు, ప్రచురణకు ముందుకొచ్చే దళిత, దళితసానుభూతిపరులకు గాని ఈ కవితా సంకలనాన్ని అంకితం చేయాలనుకుంటున్నాను.అలాగే మీ చిరునామాలు లేదా మీ ప్రస్తుత వివరాలతో మీ మీ అభిప్రాయాలను చర్చకు పెట్టాలని అనుకుంటున్నాను. కనుక ఇకపై స్పందనలను రాసే వారు ఎలాంటి మొహమాటం లేకుండా విశ్లేషణాత్మకంగా రాస్తే బాగుంటుంది.
మీ
దార్ల

Category : edit post

1 Response to " "

  1. uohyd Said,

    Dalita Tatwikudu is a wonderful poetic piece which reflects the philosophy of the Dalit Community. It should be perceived from the perspective of the society not an individual. It is a welcome step that it has been thrown open for discussion which is essential in the direction of finding a concrete solution for dalit problem . I would like to utilise an opportunity of the open debate to forward my comments in this regard later.
    Dr.J.Bheemaiah, Lecturer,Centre for Comparative Literature. University of Hyderabad, Hyderabad.

     

About Me

My Photo
Dr.Darla Venkateswara Rao, Assistant Professor, Dept .of Telugu, University of Hyderabad, (Central University), Gachibowli, Hyderabad-500 046 e-mail: vrdarla@gmail.com Ph: 040-23133563 (O), Mobile: 09989628049,