పాత రచనలు

Posted by డా.దార్ల On 10:34 PM

అంతర్జాతీయ మార్కెట్లో పవిత్రప్రేమ కవిత దగ్గర రాసిన స్పందనలు
keshavachary said...
"చందమామని వదలి ఉండలేననిఒట్టేసుకున్న వెన్నెల"....జాబిలికీ వెన్నెలకీ వున్న అనుబంధాన్ని ఎంత అద్భుతంగా చెప్పారు గురువుగారు!ఈ వాక్యాల్ని మళ్ళీ మళ్ళీ చదువుతున్నప్పుడల్లా నాకు కలిగిన అనుభూతిని,ఆనందాన్నీ చెప్పాలంటే.... చాలా కష్టంగా వుంది.అందుకోసం మళ్ళి ఓ కవిత రాయాలేమో!!!!నిజంగా ఈ కవితలో ఎంత భావుకత నిండివుందో కదా! "అల్లుకొనే లతకీఎన్నాళ్ళకీ పందిరి కాలేకపోయినఅసమర్థుడిపట్ల అసహనమని చెప్పనా?""నువ్వు నుదుటి మీద కుంకమ బొట్టుపెట్టుకొనేటప్పుడుఅద్దంలో చూసుకోవద్దుఅధరామృత స్మృతివిషబిందువై తాకిన తొలగని మచ్చేదో గుర్తొస్తుంది!మూతబడని ఈ మూగదృశ్యాన్నితొలివేదనకే రాలిన మూత్యాల గుసగుసల్నిఏనాడైనాఇంటర్ నెట్ నుంచైనా తీసుకొని ధరించే వీలుందా?"యిది నిజంగా నాకు నచ్చిన కవిత.చాలా చాలా బావుంది.
7:47 AM
radhika said...
adbhutam .manasuloa nilicipoayea adbhutamayina vaakyaalu vunnayi.
11:59 AM
బాలసుబ్రహ్మణ్యం said...
అంతా బావుంది. కాని ఒక తాత్వికుడు "దళిత" అని కుల గుర్తింపు తగిలించుకోవడమే బాలేదు. తాత్వికులు యావన్మానవ జాతికీ చెందుతారనుకుంటా. కుల గుర్తింపు అంత అవసరమా ? లేదా ఈ బ్లాగు దళితేతరుల కోసం ఉద్దేశించబడింది కాదనుకోవాలా ?
1:13 AM
spandana said...
చాలా చాలా బాగుంది.అందరూ తత్వాలు చెప్తారు. కానీ దళిత తత్వమెవరూ చెప్పరు. ఏళ్ళకేళ్ళు రోజూ చూసీ చూసీ అవమానానం అవమానంగా కనపడదు, అస్పృశ్యత అంత పాపంగా కనపడదు. కానీ దళిత కోణం చూసినప్పుడే, దళితునిగా కాసేపు ఊహించుకుంటేనే గానీ ఆ భాధ తెలియదు. గట్టున కూర్చుని ఎన్నైనా చెప్పొచ్చు.--ప్రసాద్http://blog.charasala.com
10:21 AM
ప్రసాద్ said...
మీ తాజా పోస్టు చూసి మీ కవితా సంపుటి పేరులో "దళిత" అన్నపదం తొలగిస్తారేమొనని భయపడి ఈ వాఖ్య రాస్తున్నా!"నా" ఏడుపు నాదయినప్పుడు, "మీ" ఏడుపు మీదయినప్పుడు, "మహిళా" వాదం మహిళలదయినప్పుడూ, "దళితుడి" తాత్వికత దళితుడిది ఎందుకవ్వదూ? దళితుడి దృక్కోణం నుండీ తాత్వికత దళితుడి నుండే రావాలి. అది దళిత తాత్వికతే అవుతుంది. మరొకరికి ఆ తాత్వికత చెప్పటం రాదు. అందరికీ వుపయోగపడే తాత్వికత దళితుడూ చెపుతున్నట్లయితే చెప్పనీ, కానీ దళితుల మనోభావాలు, మనుసున గుచ్చుకున్న ముళ్ళ గురించి వున్న తత్వము "దళిత తత్వమే" అవ్వాలి. పేరు గొప్పగా వుంది. దాన్ని మార్చక్కర లేదు.ఇది నా అభిప్రాయము.--ప్రసాద్http://blog.charasala.com
8:21 AM
రవి వైజాసత్య said...
తత్వాలు..దళిత తత్వాలు, బ్రాహ్మణ తత్వాలు, కమ్మ తత్వాలు, రెడ్డి తత్వాలు. ఇలా ఉండవని నా అభిప్రాయము. అంబేద్కర్ని ఇప్పటికే జాతీయ నాయకుడి నుండి దళిత నాయకున్ని చేశారు. గోడలను కూల్చటమా? పక్కనోడి కంటే పటిష్టమైన గోడ కట్టడమా?
11:45 AM

0 Response to " "

About Me

My Photo
డా.దార్ల
Dr.Darla Venkateswara Rao, Assistant Professor, Dept .of Telugu, University of Hyderabad, (Central University), Gachibowli, Hyderabad-500 046 e-mail: vrdarla@gmail.com Ph: 040-23133563 (O), 040-23136007(R) Mobile: 09989628049,
View my complete profile